![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ అదిరిపోయింది. హౌస్ మేట్స్ చేసిన త్యాగాలతో సంజన హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక నాగార్జున కంటెస్టెంట్స్ చేసిన తప్పులని చెప్తూ వచ్చాడు. శ్రీజ నువ్వు సంచాలక్ గా వున్నప్పుడు క్లారిటీగా డెసిషన్ తీసుకోవాలి కదా అని చిన్న క్లాస్ తీసుకున్నాడు.
ఇక ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కి గట్టిగానే ఇచ్చుకున్నాడు. లత్కోర్ అంటే తప్పు కాదు.. అతను అంటే తప్ప అని దానికి సంబంధించిన వీడియోని చూపిస్తాడు. సరే సర్ ఇక అలాంటి పదాలు కాకుండా డీసెంట్ గా మాట్లాడుతానని హరీష్ చెప్తాడు. ఆ తర్వాత రాము రాథోడ్ ని.. నువ్వు మాట మారుస్తున్నావని అంటాడు. సంజన ఇలా అందని తనూజతో వెళ్లి చెప్పడం.. మళ్ళీ అలా అనలేదని చెప్పడం.. అలా చేయోద్దు. ఒక మాట మీదనే ఉండాలని దానికి సంబంధించిన వీడియోని చూపించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని.. నువ్వు అసలు ఎక్కడ కన్పించడం లేదు.. నువ్వు ఆట ఆడకపోతే నా పక్కన ఉంటావని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
ఆ తర్వాత ఇందాక బ్రేక్ లో తనూజ టీ పెట్టమంది.. నేను పెట్టనని చెప్పాను సర్. ఎందుకు అంటే నేషనల్ టెలివిజన్ ముందు నేను నీట్ గా లేనని సంజన చెప్తే హౌస్ మేట్స్ ఎవరు నా కోసం స్టాండ్ తీసుకోలేదు.. అదేం లేదు బాగా వండుతున్నాడు.. హైజీన్ మేన్టైన్ చేస్తున్నాడని సపోర్ట్ చెయ్యలేదని హరీష్ అంటాడు. అలా నీకు స్టాండ్ తీసుకునేలా నువ్వు మారాలని అటు తిరిగి.. ఇటు తిరిగి హరీష్ నే అంటాడు నాగార్జున.
![]() |
![]() |